స్టయిలిష్‌గా టాటా కొత్త టైగోర్‌

స్టయిలిష్‌గా టాటా కొత్త టైగోర్‌

  న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా సరికొత్త కాంపాక్ట్ సెడాన్  న్యూలుక్‌తో రీలాంచ్‌ చేసింది. దసరా, దీపావళి ఫెస్టివ్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని టైగోర్‌ ఫేస్‌లిప్ట్‌ను లాంచ్‌ చేసింది. లుక్స్‌, ఫీచర్స్‌, డిజైన్‌లో మార్పులు చేసి స్టయిలిష్‌లుక్‌లో   కొత్త టైగోర్‌ను  విడుదల చేసింది. 15 అంగుళాల డ్యుయల్‌ టోన్‌ అల్లోయ్‌ వీల్స్‌,  క్రిస్టల్‌ ఎ ల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌తోపాటు, ఇంటీరియర్‌ లుక్స్‌లో కూడా అప్‌డేట్‌ చేసింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల ఇన్పోటేన్మెంట్  టచ్‌ స్క్రీన్ విత్‌,  4 స్పీకర్లు,   4 ట్వీటర్స్‌ను జోడించింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఆరు రంగుల్లో  ఇది లభిస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌ కార్ల ధరను  5.20-6.65 లక్షల రూపాయిలు మధ్య  నిర్ణయించింది.  అలాగే డీజిల్‌ వెర్షన్‌ కార్ల ధరలను రూ.6.09 -7.38లక్షలుగా ఉంచింది.