5జి కోసం చైనా తొలి ఇన్నోవేషన్‌ పార్కు

5జి కోసం చైనా తొలి ఇన్నోవేషన్‌ పార్కు

   బీజింగ్‌: అయిదో తరం నెట్‌వర్కు (5జి) కోసం తూర్పు చైనా జెజియాంగ్‌ ప్రొవిన్స్‌లో అధునాతన ఇన్నోవేషన్‌ పార్కును ఆదివారం ప్రారంభించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జి నెట్‌వర్కు ఆవిష్కరణకు పరిశోధనలు నిర్వహించేందుకు అన్ని వసతులతో చైనా ఏర్పాటు చేసిన తొలి ఇన్నోవేషన్‌ పార్కు ఇదే. 5జి నెట్‌వర్కు సేవలను ఎప్పుడైనా రావచ్చని చైనా ఇండిస్టీ ఇన్‌సైడర్స్‌ కొందరు చెబుతున్నారు. 5జి నెట్‌వర్కు స్పీడ్‌ ఇప్పుడున్న దానికన్నా అనేక రెట్లు అధికంగా వుంటుందని, మొబైల్‌ టెక్నాలజీలో అది పెను సంచలనం సృష్టిస్తుందని వార్తలొస్తున్నాయి. అయితే 5జి నెట్‌వర్కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదని మొబైల్‌ రంగంలో చైనా దిగ్గజం హ్యూవెయి టెక్నాలజీస్‌ తెలిపింది. ఈ దిశగా సాగించే కృషిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆ కంపెనీ సిఇవో సియాంగ్‌ లిగాంగ్‌ చెప్పారు.