ఇన్ఫోసిస్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజీనామా

ఇన్ఫోసిస్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజీనామా

 బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌కు మరో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన ఇన్ఫోసిస్‌ ఎనర్జీ, యుటిలిటీస్‌, రిసోర్సెస్‌ అండ్‌ సర్వీసెస్‌ యూనిట్‌ గ్లోబల్‌ హెడ్‌ సుదీప్‌ సింగ్‌ తాజాగా రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు దారి తీసిన కారణాలపై అటు ఇన్ఫీ, ఇటు సుదీప్‌ కాని వెల్లడించలేదు. గత సంవత్సరం జనవరిలో యూరోప్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ కష్ణమూర్తి, అక్టోబర్‌లో గ్లోబల్‌ హెడ్‌ కెన్‌ టూమ్స్‌, అంతకుముందు, కంపెనీ సిఒఒ ఉన్న రంగనాథ్‌ ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. తాజాగా సుదీప్‌ రాజీనామా చేయడం ఐటి వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.గతేడాది నుంచి వరుసగా ఇన్ఫోసిస్‌ నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఒక్కొక్కరు వైదొలగడం గమనార్హం. ఇన్ఫోసిస్‌ 100 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ నుంచి 750 మిలియన్‌ డాలర్లకు చేరడంలో సుదీప్‌ పాత్ర కూడా కీలకంగా ఉంది.