టెస్ట్‌లకు మున్రో గుడ్‌బై

టెస్ట్‌లకు మున్రో గుడ్‌బై

 వెల్లింగ్టన్: న్యూజిలాండ్ విధ్వంసక క్రికెటర్ కొలిన్ మున్రో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై టెస్ట్ సెలెక్షన్ తాను అందుబాటులో ఉండనని ప్రకటించాడు. టెస్ట్‌లకు దూరమైనా వన్డే, టీ20 కెరీర్‌పై దృష్టిసారిస్తానని మున్రో అన్నాడు. సరిగ్గా ఐదేండ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేవలం ఒక టెస్ట్ ఆడిన మున్రో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కివీస్‌కు కీలక ఆటగానిగా ఎదిగాడు. తనదైన విధ్వంసక ఆటతీరుతో ప్రస్తుత ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. ఇక నుంచి వన్డే, టీ20లపైనే దృష్టి. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ లక్ష్యంగా జట్టులో కీలకమవుతాను అని అన్నాడు.