అం అద్మి పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య.

అం అద్మి పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య.

దిల్లీ: ఆమ్‌ఆద్మీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. నరేలాలోని తన ఇంట్లో విషం తాగి మృతి చెందింది. తనపై వేధింపులకు పాల్పడిన తోటి కార్యకర్త బెయిల్‌పై విడుదల కావడంతో మనస్తాపం గురిచెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తనను తోటి కార్యకర్త వేధిస్తున్నాడంటూ సదరు మహిళ గత జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. వేధింపులకు పాల్పడిన వ్యక్తికి స్థానిక ఎమ్మెల్యే మద్దతుందని.. అతడు విడుదల కావడంతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో ఆప్‌ పార్టీపై భాజపా విమర్శల వర్షం కురిపించింది. ఆప్‌లో మహిళలకు సరైన రక్షణ లేదని.. వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. అయితే భాజపా విమర్శలను ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. కార్యకర్త ఆత్మహత్యను భాజపా రాజకీయం చేయాలని చూస్తోందని ఆప్‌ ఆరోపించింది.