బాలాపూర్‌లో ‘యాబా’ డ్రగ్ పట్టివేత

బాలాపూర్‌లో ‘యాబా’ డ్రగ్ పట్టివేత

 రంగారెడ్డి: జిల్లాలోని బాలాపూర్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.90 వేల విలువైన 133 గ్రాముల 7 డ్రగ్స్ ప్యాకెట్స్, 2 సెల్‌ఫోన్లు, 26 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. డ్రగ్స్‌ను ట్యాబ్లెట్ల రూపంలో నిందితులు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాబ్లెట్‌ను వాళ్లు సుమారు రూ.150 కి విక్రయిస్తున్నట్టు సీపీ వెల్లడించారు. ఒక్కో ట్యాబ్లెట్ మూడు రోజుల వరకు పని చేస్తుంది. వీటిని థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ డ్రగ్‌ను యాబా డ్రగ్‌గా పిలుస్తారని సీపీ మీడియాకు తెలిపారు.