హాక్ ఐ యాప్ ద్వారా దొరికిన సెల్‌ఫోన్లు

హాక్ ఐ యాప్ ద్వారా దొరికిన సెల్‌ఫోన్లు

  హైదరాబాద్: హాక్ ఐ ద్వారా పోయిన సెల్‌ఫోన్లను పోలీసులు కనిపెట్టారు. యాప్ ద్వారా ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. సుమారు రూ.2 లక్షల విలువైన 24 సెల్‌ఫోన్లను గుర్తించిన పోలీసులు ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఫోన్లు గుర్తించి ఫిర్యాదు దారులకు అందజేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సెల్‌ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెలలో బిగ్‌సీ షోరూం నుంచి రూ.5.5లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. చోరీకి పాల్పడిన ఫైజుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.