లోకల్ ట్రైన్‌లో మహిళను వేధించాడు..

లోకల్ ట్రైన్‌లో మహిళను వేధించాడు..

 ముంబై: దాదర్ కుర్లా మధ్య నడిచే లోకల్ ట్రైన్‌లో ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరో ప్రయాణికుడు ఆ ఘటనను తన కెమెరాలో బంధించాడు. మహిళను వేధిస్తున్న వీడియో బయటకురావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. దాదర్ రైల్వే స్టేషన్‌లో నిందితున్ని అరెస్టు చేశారు. దివ్యాంగుల కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్న మహిళను నిందితుడు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఆమెపై అతను పదేపదే చేయిచేసుకున్నాడు. నిందితున్ని సమీర్ జవేరిగా గుర్తించారు.