ఇక నుంచి హైదరాబాద్ లో  భూగర్భ కరెంటు.

ఇక నుంచి హైదరాబాద్ లో  భూగర్భ కరెంటు.

ఇక నుంచి హైదరాబాద్ లో  భూగర్భ కరెంటు.
ఒక్క గాలివాన వస్తే చాలు రోడ్లుపైనున్న చెట్లు వాటిపై కూలడం, స్తంభాలు వంగిపోవడం.. వైర్లు తెగిపోవడం.. వెరసి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇదంతా హైదరాబాదులో షరా మామూలే . ఈ కరెంటు కష్టాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించే చర్యల్లో భాగంగా మౌలిక సదుపాయాలను ఆధునీకరించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరా వ్యవస్థను భూగర్భంలోకి మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏటా వెయ్యి కిలోమీటర్ల పొడవున విద్యుత్ కేబుళ్లను భూగర్భంలోకి మార్చాలనే ఆలోచనతో ముందుకు సాగేందుకు చర్యలు చేబడుతుంది . అయితే ఇప్పటికే ఢిల్లీ, ముంబై మహానగరాల్లో అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ అమలులో ఉంది. అక్కడకూడా వైట్‌ట్యాప్ రోడ్లు వేయడానికి ముందే అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులు పూర్తిచేశారు.