ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి

ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి

హైదరాబాద్: తెలుగు ప్రపంచ మహాసభల్లో తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుపై సీఎం కేసిఆర్ విధానపర ప్రకటన చేసే విధంగా పాలసీ రూపకల్పన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయనున్నారు. అన్ని మీడియంలలో తెలుగు తప్పనిసరి సబ్జెక్టు కానుంది.

 ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ చట్టంలో మార్పులు చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు చట్టంలో మార్పులకు ప్రతిపాదనలు సూచించడానికి కమిటీ ఏర్పాటు చేసింది. స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఇతర భాషల మీడియాల్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది.

 ఏ రాష్ట్రం నుంచి వచ్చినా తెలుగు కచ్చితంగా నేర్చుకోవాలి. తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అంశంపై సమావేశంలో డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.