మొబైల్ షోరూంను ప్రారంభించిన మ‌హాన‌టి

మొబైల్ షోరూంను ప్రారంభించిన మ‌హాన‌టి

 గుంటూరు : మహానటి సావిత్రి పుట్టిన గుంటూరు జిల్లాకు రావడం ఎంతో ఆనందంగా ఉంద‌ని హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ షోరూంను ప్రారంభించారు. కీర్తిసురేష్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గుంటూరుకు వచ్చి అభిమానులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికీ మహానటి సావిత్రి తనతో ఉందనిపిస్తుందన్నారు. మహానటి తర్వాత తాను ఇప్పటివరకూ ఏ సినిమా ఒప్పుకోలేదని, మంచి కథకోసం ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు. కధానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలతోపాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తానన్నారు.