గోంగూర చికెన్‌ మాంసం

గోంగూర చికెన్‌ మాంసం

 గోంగూర మాంసంకు కావల్సినవి :  చికెన్‌ : 1 కేజీ, గోంగూర : 100గ్రా, ఉల్లిపాయలు 2, పుదీనా : కొద్దిగా, ఎండుమిర్చి : 10, నీళ్లు : 1గ్లాసు, కారం : 1స్పూను, ఉప్పు : రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : 1 స్పూను, మసాలా పొడి : 1స్పూను, పసుపు : 1/2 స్పూను, ఆయిల్‌ : సరిపడా, కొత్తిమీర : కొద్దిగా, నీళ్ళు : చికెన్‌ ఉడికించుకోడానికి సరిపడా

తయారీ : మిక్సీలో ఎండుమిర్చి, కొత్తిమీరను వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెజర్‌ కుక్కర్‌లో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్‌ ముక్కలు వేసి, చికెన్‌ ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి. అందులోనే కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపేస్ట్‌ వేసి బాగా మిక్స్‌ చేసి మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగించుకోవాలి. పోపు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో గోంగూర ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మొదట పేస్ట్‌ చేసిపెట్టుకొన్న ఎండుమిర్చి కొత్తిమీర పేస్ట్‌ను అందులో వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం మాడిపోకుండా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకొన్న చికెన్‌ వేయాలి. చికెన్‌ తో పాటు, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే గోంగూర చికెన్‌ రెడీ...