ప్రారంభమైన భారత నావికా దళ రక్షణ విన్యాసాలు

ప్రారంభమైన భారత నావికా దళ రక్షణ విన్యాసాలు

  న్యూఢిల్లీ : భారత నావికాదళ సన్నద్ధతను సమీక్షించడానికి మంగళవారం భారత తీర ప్రాంతంలో అతిపెద్ద తీరప్రాంత రక్షణ దళ విన్యాసాలను నిర్వహించింది. ఇందులో భారత నావికాదళం, తీర ప్రాంత రక్షణ దళం పాల్గన్నాయి. 26/11 తరహాలో దేశంపై మరో దాడి జరిగితే దాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టడానికి ఈ విన్యాసాలు చేపట్టారు. 'సీ విజిల్‌ 2019' పేరుతో, 7,516.6 కిలోమీటర్ల మేరా సాగే తీర ప్రాంతంలో రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. వివిధ సంస్థలకు చెందిన బృందాలు తీరప్రాంత జిల్లాల్లో మోహరించారు. సముద్ర మార్గం ద్వారా తీవ్రవాదులు దేశంలోకి చొరవడితే వారిని ఎదుర్కొనడానికి తీరప్రాంతాల్లో గల భద్రతను, గస్తీని పరీక్షించడమే ఈ విన్యాసాల లక్ష్యం. కోచిలోని దక్షిణ నావికా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.