లోకేశ్ ఒక్కడేనా.. అంతలేదు ఇద్దరం ఉంటాం..!

లోకేశ్ ఒక్కడేనా.. అంతలేదు ఇద్దరం ఉంటాం..!

రాష్ట్ర విభజన జరిగిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు ఏపీకే అంకితమైపోయారు. అయితే ఏపీలో ఎలాగూ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇందుకు విరుద్దం. అక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ దే హవా అంతా. ఇప్పటికే ఇతర పార్టీల నుండి నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. టీడీపీ నుండి కూడా పదిమందికి పైగా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలోని టీడీపీకి కాస్త సమయం కేటాయించమని గతంలో నేతలు చంద్రబాబును కోరడం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి టీటీడీపీ నేతలు ఈ విషయంపై చంద్రబాబుతో భేటీ అయ్యారు.
 
మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్ తదితరులు చంద్రబాబుతో భేటీ అయి..  తెలంగాణలో పార్టీ క్యాడర్ పై నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారని.. అలాకాకుండా పార్టీ తిరిగి పుంజుకునేలా కనీసం తన కుమారుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను అంకితం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అలా అయినా వారిలో తిరిగి మానసిక స్థైర్యాన్ని నింపవచ్చని కోరారట. అయితే దీనిని చంద్రబాబు మాత్రం తిరస్కరించారట. తాను ఒక్కడే కాదు.. తెలంగాణకు ఇద్దరమూ సమయం కేటాయిస్తామని, పార్టీ సమస్యలను పరిష్కరిస్తామని మాత్రం హామీ ఇచ్చారట.