ప్రేమలో రిషబ్  పంత్!

ప్రేమలో రిషబ్  పంత్!

 భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ప్రేమ వ్యవహారాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో అమ్మాయితో దిగిన ఫొటోను నా జీవితంలో సంతోషానికి నీవే కారణం..నిన్ను కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నా అన్న కామెంట్‌తో షేర్ చేశాడు. ఆ అమ్మాయి పేరు ఇషా నేగి. తను ఇంటీరియర్ డిజైనర్. ఇషా కూడా మై మ్యాన్, మై సోల్‌మేట్, మై బెస్ట్‌ఫ్రెండ్, లవ్ ఆఫ్ మై లైఫ్ అన్న కామెంట్‌తో షేర్ చేయడం విశేషం. దీంతో వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో యువ వికెట్‌కీపర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న పంత్..కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.