మూడు రోజుల హింసలో 900 మంది బలి

మూడు రోజుల హింసలో 900 మంది బలి

  బ్రిజెల్లె: రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో అధికారంకోసం జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా గత నెల చివరిలో మూడు రోజులపాటు కొనసాగిన హింసాకాండలో దాదాపు 890 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 465 ఇళ్లు దగ్ధం కాగా, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక ఆరోగ్య కేంద్రం, హెల్త్‌ చెక్‌పోస్ట్‌, మార్కెట్‌, ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వంటి పలు భవనాలు పూర్తి స్థాయిలో విధ్వంసానికి గురయ్యాయని ఐరాస తన నివేదికలో తెలిపింది. ఈ ఘర్షణలు, హింసాకాండలో నిర్వాసితులైన దాదాపు 16 వేల మందికి పైగా ప్రజలు కాంగోనది దాటి డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోకి ప్రవేశించారని ఈ నివేదిక వివరించింది. ఈ హింసాకాండపై సమగ్ర దర్యాప్తు జరిపి కుట్రదారులను న్యాయస్థానంలో నిలబెట్టటం ప్రధానమని ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ మిచెల్లీ బాచ్లెట్‌ అన్నారు. మానవ చరిత్రలో అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హింసాకాండ తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.