యాక్సెస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటీ

యాక్సెస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటీ

  ముంబై : జపాన్‌కు చెందిన స్కూటర్‌ తయారీ సంస్థ సుజుకీ యాక్సెస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. కంబైండ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(సీబీఎస్‌) టెక్నాలజీని ఈ బైక్‌కు సుజుకీ జోడించింది. ప్రస్తుతం సుజుకీ యాక్సెస్‌ సీబీఎస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ.60,580గా నిర్ణయించారు. 125 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్‌ ఎస్‌ఈపీ టెక్నాలజీపై పని చేస్తుంది.

అంతేకాకుండా కొత్త యాక్సెస్‌లో ఉన్న సీబీఎస్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ వాహనాన్ని మరింత బ్యాలెన్సింగ్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మెటాలిక్‌ సోనిక్‌ సిల్వర్‌ స్పెషల్‌ ఎడిషన్‌లో నల్లరంగు అలాయ్‌ వీల్స్‌, గుండ్రటి అద్దాలు కొత్త యాక్సెస్‌కు అదనపు ఆకర్ణణగా నిలుస్తాయని పేర్కొన్నారు.