బజాజ్ డిస్కవరీలో మరో రెండు బైకులు

బజాజ్ డిస్కవరీలో మరో రెండు బైకులు

 న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో..ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి రెండు నూతన బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రూ.50,496 విలువైన డిస్కవరీ 110 మోడల్ కాగా, మరొకటి రూ.56,314 ధర కలిగిన డిస్కవరీ 125 మోడల్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 115.5 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన డిస్కవరీ 110 కాగా, 124.5 సీసీ సామర్థ్యంతో రూపొందించిన మరో బైకు రూ. 53,491గాను, అలాగే డ్రమ్, డిస్క్ వెర్షన్ మోడల్ రూ.56,314కి లభించనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ వ్యాస్ మాట్లాడుతూ..100-125 సీసీలోపు సామర్థ్యం కలిగిన బైకులను కోరుకుంటున్న వినియోగదారులకు నూతన ఫీచర్స్‌తో ఈ బైకులను రూపొందించినట్లు తెలిపారు. రోజంతా వెలిగే ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్స్ ఉన్నాయని ఆయన వెల్లడించారు.