బడ్జెట్‌ ధరలో బీఎండబ్ల్యు కొత్త ఎస్‌యూవీ

బడ్జెట్‌ ధరలో బీఎండబ్ల్యు కొత్త ఎస్‌యూవీ

 న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కారు తయారీదారు బీఎండబ్ల్యు కొత్త ఎస్‌యూవీని ఢిల్లీలో లాంచ్‌ చేసింది. కొత్త జనరేషన్‌​ మినీ కంట్రీమ్యాన్  కార్లను నేడు(గురువారం)  ప్రారంభించింది. పెట్రోల్,  డీజిల్ ఇంజిన్  వెర్షన్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. మినీ కంట్రీమ్యాన్‌ వెహికల్‌ ప్రారంభధర రూ.34.9లక్షలు( ఎక్స్‌షో రూం, ఢిల్లీ) గా ఉంది.  కూపర్‌ ఎస్‌, కూపర్‌ ఎస్‌ జేసీడబ్ల్యు, కూపర్‌ ఎస్‌డీ అనే మూడు వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ లభిస్తుంది. 

కూపర్ ఎస్ (రూ 34.90 లక్షలు), కూపర్ ఎస్‌డీ (రూ. 37.40 లక్షలు), స్పోర్టి కూపర్ ఎస్ జె సి డబ్ల్యు (రూ 41.40 లక్షలు). 2018 జూన్‌నుంచి  ఈ కార్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని బీఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌ విక్రం పాహాహ్‌ వెల్లడించారు.మొదట 2018 ఆటో ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శించగా  ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ​మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ, ఆడీ క్యూ3 లాంటి గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.  ముఖ్యంగా చిన్న లగ్జరీ ఎస్‌యూవీలతో పోలిస్తే   బీఎండబ్ల్యు  సెకండ్‌ జనరేషన​ మినీ కంట్రీ‍మ్యాన్‌ రూ .34.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)  ధరకే  అందుబాటులో ఉందని భావిస్తున్నారు.