దేశీ మార్కెట్లోకి పోర్షే కారు

దేశీ మార్కెట్లోకి పోర్షే కారు

 ముంబై : భారత మార్కెట్‌లో పోర్షే ఎస్‌యూవీ మోడల్‌ లేటెస్ట్‌ జనరేషన్‌ కయానే లాంఛ్‌ అయింది. కస్టమర్లు కయానే, కయానే ఈ హైబ్రిడ్‌, కయానే టర్బో వంటి మూడు మోడల్స్‌ నుంచి తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. ముంబైలోని సహారా స్టార్‌ హోటల్‌లో ప్రతిష్టాత్మక ఎస్‌యూవీను పోర్షే ఇండియా అట్టహాసంగా లాంఛ్‌ చేసింది.ఈ ప్రోడక్ట్‌ లాంఛ్‌ సందర్భంగా మూడు మోడల్స్‌నూ ప్రదర్శించారు. కొత్త కయానేలో అత్యాధునిక రియర్‌ యాక్సిల్‌ స్టీరింగ్‌, షార్పర్‌ డిజైన్‌, మెరుగైన ఛేసిస్‌ సిస్టమ్స్‌తో అద్భుత సామర్థ్యంతో లేటెస్ట్‌ ఫీచర్లను పొందుపరిచారు. ఇంటెలిజెంట్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌, కనెక్టివిటీ ఫీచర్స్‌ను అదనంగా సమకూర్చారు.

కయానే టర్బో కేవలం 3.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, వార్న్‌, బ్రేక్‌ అసిస్ట్‌ సిస్టమ్స్‌, క్రూయిజ్‌ కం‍ట్రోల్‌ సిస్టమ్స్‌ను పొందుపరిచారు. భారత్‌లోని అన్ని పోర్షే షోరూమ్స్‌లో కయానే, కయానే ఈ హైబ్రిడ్‌, కయానే టర్బోలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ కార్ల బుకింగ్‌ ప్రారంభం కాగా కయానే రూ 1.19 కోట్లు, కయానే ఈ హైబ్రిడ్‌ రూ 1.58 కోట్లు, కయానే టర్బో రూ 1.92 కోట్లు ధర పలుకుతోంది.