దూసుకుపోతున్న సరికొత్త శాంత్రో

దూసుకుపోతున్న సరికొత్త శాంత్రో

  ముంబై: సరికొత్తగా ముస్తాబై మార్కెట్లో రీలాంచ్‌ అయిన  హ్యుందాయ్‌ శాంత్రో (2018) దూసుకుపోతోంది.  కస్టమర్ల విశేష ఆదరణతో తన ప్రాభవాన్ని మరోసారి చాటుకుంటోంది. కేవలం 12రోజుల్లో 23,500 బుకింగ్‌లను సాధించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత  స్మాల్‌ కార్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ కారుగా శాంత్రో ఎహెచ్‌-2 ను  లాంచ్‌ చేసిందిశాంత్రో కారుకు ప్రీ బుకింగ్‌లు అక్టోబర్ 10, 2018న ప్రారంభం కాగా ఇప్పటికే  23500 బుకింగ్‌లు వచ్చాయని హ్యుందాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల ఆదరణను తాము తిరిగి సంపాదించడం సంతోషంగా ఉందని హ్యుందాయ్‌ ఇండియా ఎండీ వెల్లడించారు. భారీ సంఖ్యలో  బుకింగ్‌లతో 3నెలలకు సరిపడా ఉత్పత్తి వాల్యూమ్‌ను పొందామంటూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ-బుకింగ్లు నిన్నటితో నిలిచిపోయాయన్నారు.

హ్యుందాయ్ కొత్త  శాంత్రో ఒక గ్లోబల్ ప్రొడక్ట్ అని స్పష్టం చేసిన కంపెనీ దేశీయంగా డిమాండ్‌ లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం ఇతర మార్కెట్లకు కూడా విస్తరిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ కొత్త ఆల్‌ న్యూ శాంత్రో ప్రారంభ ధర 3.89 లక్షల రూపాయలు. 5 వేరియంట్లలో 7కలర్‌ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది. డ్లైట్ , ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్‌, ఆస్టా పేర్లతో లభ్యమవుతున్నాయి. మ్యాగ్నా, స్పోర్ట్స్‌ లో సీఎన్ జీ  వెర్షన్‌ కూడా ఉంది.