ఈ బైకు ధరను రూ.20.73 లక్షలు

ఈ బైకు ధరను రూ.20.73 లక్షలు

 న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు యమహా..దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త బైకును ప్రవేశపెట్టింది. వైజెడ్‌ఎఫ్-ఆర్1ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ ప్రవేశపెట్టిన ఈ బైకు ధరను రూ.20.73 లక్షలుగా నిర్ణయించింది. 998 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ బైకు 200 హెచ్‌పీల శక్తినివ్వనున్నది. దేశీయ సూపర్‌బైకుల సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వైజెడ్‌ఎఫ్-ఆర్1ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ తెలిపారు. గతబైకులతో పోలిస్తే ఈ మోడల్ ఏరోడైనమిక్‌ను మరింత ఆధునీకరించినట్లు చెప్పారు. యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ బైకుతో మార్కెట్ వాటా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.