ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త పస్సాట్

 న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్..ప్రీమియం సెడాన్ పస్సాట్‌లో నూతన వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధరను రూ.29.99 లక్షలుగా నిర్ణయిం చింది. హై ఎండ్ మోడల్ రూ.32.99 లక్షలకు లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ కింద రూపొందించిన ఈ కారు 2 లీటర్ల డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్‌జీ గేర్‌బ్యాక్స్ ఉన్నాయి.

ఈ నూతన పస్సాట్‌కోసం మంగళవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించినప్పటికీ, కొనుగోలుదారులకు మాత్రం జనవరి నుంచి అందచేయనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు సేల్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ క్నాప్ తెలిపారు. ఈ నూతన కారుతో భారత్‌లో కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నదని, ఈ ఏడాది విడుదల చేసిన కార్లలో పస్సాట్ మూడోదని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది ఎయిర్‌బ్యాగులు కలిగిన ఈ పస్సాట్‌లో రియర్ కెమెరా, కొండలను ఎక్కే వీలుగా ఇంజిన్ సామర్థ్యాన్ని పెంపొందించినట్లు చెప్పారు.