జాగ్వార్‌ దేశీ ‘ఎఫ్‌–పేస్‌’

జాగ్వార్‌ దేశీ ‘ఎఫ్‌–పేస్‌’

  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)... మేకిన్‌ ఇండియా పాలసీలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన జాగ్వార్‌ ‘ఎఫ్‌–పేస్‌’ ఎస్‌యూవీని సోమవారం మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.2 లీటర్ల టర్బో చార్జ్‌ ఇంజినియం పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగిన ఈ కారు ధర రూ.63.17 లక్షలు. పార్క్‌ అసిస్ట్, లేన్‌ కీప్‌ అసిస్ట్, కాబిన్‌ ఎయిర్‌ ఐయోనైజేషన్, డ్రైవర్‌ కండీషన్‌ మానిటరింగ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తాజా ఎస్‌యూవీ ద్వారా భారత మార్కెట్‌లో జాగ్వార్‌ మరింత మెరుగుపడిందని సంస్థ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 27 అవుట్‌లెట్ల ద్వారా ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్, ఎఫ్‌–పేస్, ఎక్స్‌జే, ఎఫ్‌–టైప్‌ రేంజ్‌ జాగ్వార్లను సంస్థ విక్రయిస్తోంది.