కొత్త సాంత్రో కారు వచ్చేసింది....!

కొత్త సాంత్రో కారు వచ్చేసింది....!

 న్యూఢిల్లీ: హ్యుండయ్ మోటార్స్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కార్లలో సాంత్రో కూడా ఒకటి. మిడిల్ క్లాస్ కోరుకునే బడ్జెట్ కార్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి సాంత్రో ఇప్పుడు కొత్త లుక్‌తో మరోసారి మార్కెట్‌లోకి వచ్చేసింది. మంగళవారం హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఈ కారును ఆవిష్కరించింది. ఈ కొత్త సాంత్రో 4-సిలిండర్ 1.1 లీటర్ ఇంజిన్‌తో రానుంది. స్మార్ట్ ఆటో ఏఎంటీ టెక్నాలజీ, ఫ్యాక్టరీలోని నిర్మితమైన సీఎన్‌జీ ఆప్షన్‌తో వస్తున్న తొలి హ్యుండాయ్ కారు ఇదే కావడం విశేషం. ఈ కారు ప్రి బుకింగ్స్ బుధవారం నుంచి ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. రూ.11,100 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

మొదటగా బుక్ చేసుకొనే 50 వేల మంది కస్టమర్లకు ఈ అవకాశం ఉంటుంది. ఈ కారు ధరను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య నిర్ణయించారు. కారు లోపల 17.64 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ ఉంటుంది. దీనికి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మిర్రర్ లింక్‌లాంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉంటాయి. వాయిస్ రికాగ్‌నిషన్, రియర్ పార్కింగ్ కెమెరా డిస్‌ప్లే కూడా ఈ స్క్రీన్‌లో ఉండటం విశేషం. స్టాండర్డ్ ఏబీఎస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఈ కొత్త సాంత్రో కారులో ఉన్నాయి. ముందు, వెనుక ఏసీలు అందుబాటులో ఉంటాయి.