మహీంద్రా ఎక్స్‌యువీ500లో పెట్రోల్ వెర్షన్

మహీంద్రా ఎక్స్‌యువీ500లో పెట్రోల్ వెర్షన్

  న్యూఢిల్లీ : దేశంలో ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ కారైన ఎక్స్‌యూవీ 500లో పెట్రోల్ వెర్షన్ మార్కెట్లోకి విడుదల చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.15.49 లక్షలకు లభించనున్నది. 2.2 లీటర్ల ఎంహక్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ వాహనం 140 హెచ్‌పీల శక్తిని, ఆరు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ రకంకోసం వేచి చూస్తున్న వినియోగదారులకు ఇది సరైన వాహనమని కంపెనీ మార్కెటింగ్ అధిపతి విజయ్ రామ్ నక్రా తెలిపారు. నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వాహనంలో బటన్‌తో స్టార్ట్ చేయవచ్చును, అలాగే హెడ్‌లైట్లను వంపుకోవచ్చునని చెప్పారు.