మార్కెట్‌లోకి వెర్నా కొత్త వేరియంట్లు

మార్కెట్‌లోకి వెర్నా కొత్త వేరియంట్లు

 హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ తన మిడ్‌సైజు ప్రీమియం సెడాన్‌ వెర్నాలో రెండు కొత్త వేరియంట్లను బుధవారం లాంచ్‌ చేసింది. 1.4 లీటరు పెట్రోల్‌ ఇంజిన్‌తో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.7,79,000, రూ.9,09,000గా ఉన్నాయి. గతేడాది ఆగస్టులోనే కంపెనీ తన కొత్త తరం వెర్నాను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాంచ్‌ అయిన తన తర్వాతి జనరేషన్‌ వెర్నాలో 1.4లీటరు కప్పా డ్యూయల్‌ వీటీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. 

ఇది పనితీరుకు, ఇంధన సామర్థ్యానికి కచ్చితమైన కలయికగా ఉపయోగపడుతోందని కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త వేరియంట్లు వెర్నా పాపులారిటీని మరింత బలోపేతం చేస్తామని, సెడాన్‌ను ఎంపికను, అనుభూతిని మరింత విస్తృతం చేస్తాయని చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు 100పీఎస్‌ పవర్‌ అవుట్‌పుట్‌, 19.1కేఎంపీఎల్‌ ఇంధన సామర్థ్యాన్ని ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. సిక్స్‌-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ను ఈ మోడల్స్‌ ఆఫర్‌ చేయనున్నాయి.