మెర్సిడెస్‌ ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌’లో కొత్త వెర్షన్‌

మెర్సిడెస్‌ ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌’లో కొత్త వెర్షన్‌

  గ్రేటర్‌ నోయిడా: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌–బెంజ్‌’ తాజాగా తన ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌’  సెడాన్‌ కారులో కొత్త వెర్షన్‌ ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌ 4 మేటిక్‌ ప్లస్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. తాజా కొత్త వెర్షన్‌తో కలుపుకొని కంపెనీ దేశంలో మొత్తంగా 14 ఏఎంజీ మోడళ్లను విక్రయిస్తోంది. ‘కస్టమర్ల నుంచి ఏఎంజీ మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ ఏడాదిలో మరిన్ని ఏఎంజీ మోడళ్లను, ఇతర కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తాం’ అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు. ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌ 4 మేటిక్‌ ప్లస్‌’లో 4 లీటర్‌ ట్విన్‌టర్బో వీ8 ఇంజిన్‌ను అమర్చామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొన్నారు.