రోల్స్‌ రాయిస్‌ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి

రోల్స్‌ రాయిస్‌ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి

  బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్ రాయిస్‌ భారతదేశంలో మరో న్యూ మోడల్‌ కారును మన మార్కెట్లోకి తీసుకొచ్చింది.  కలినన్‌ ఎస్‌యూవీ ధరను భారతదేశంలో రూ .6.95 కోట్ల (ఎక్స్‌ షోరూం, ఇండియా) ధరగా  నిర్ణయించింది.   రోల్స్ రాయిస్ కొత్త ఎస్‌యూవీని 'లగ్జరీ ఆర్కిటెక్చర్' గా నిర్మించినట్టు  కంపెనీ ప్రకటించింది.ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా చెప్పుకునే కలినన్‌ డైమండ్‌ పేరుతో 'రోల్స్‌ రాయిస్‌ కలినన్‌'ను  విడుదల చేసింది రోల్స్‌ రాయిస్‌. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాస్ట్‌లీ ఎస్‌యూవీ కూడా ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ కారును తయారుచేశామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా  'ఎవ్రీవేర్' మోడ్‌ ఆప్షన్‌ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును ఏమాత్రం కుదుపులు లేకుండా, హాయిగా నడపొచ్చని  పేర్కొంది.

 
ఫీచర్లు
6.75 లీటర్ల వీ 12 ఇంజిన్‌, 653 బీహెచ్‌పీ శక్తిని, 850 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డాష్‌బోర్డుపై టచ్‌స్క్రీన్‌తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాల టచ్‌స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు.  22 అంగుళాల అల్లోయ్‌ వీల్స్‌  జోడించింది. అలాగే వెనుకవైపు సీట్ల కింద బూట్‌లో రెండు ఇన్నర్ బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలనుకుంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా మార్చుకోవచ్చన్నమాట.