సారథ్యంలోనే సఫారీ టూర్‌కు..

సారథ్యంలోనే సఫారీ టూర్‌కు..

 న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది జట్టుకు హైదరాబాద్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2017-2020)లో భాగంగా జరిగే ఈ టూర్ వచ్చే నెల 5న మొదలుకానుంది. వన్డే సిరీస్ తర్వాత జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశాలున్నాయి. గతేడాది జూలైలో వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమ్‌ఇండియాకు మళ్లీ ఇదే మొదటి సిరీస్. జట్టు ఎంపికలో భారీ మార్పులు చేయని సెలెక్టర్లు.. అండర్-19 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన 17 ఏండ్ల ముంబై యువ బ్యాట్స్‌వుమన్ జెమీమ్ రొడ్రిగేస్‌కు అవకాశం కల్పించారు. జట్టు వివరాలు: మిథాలీ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్, సుష్మ వర్మ, ఏక్తా బిస్త్, స్మృతి మందన, పూనమ్ యాదవ్, పూనమ్ రౌట్, రాజేశ్వరి, రొడ్రిగేస్, జులన్, దీప్తి, శిఖా పాండే, మోనా మేశ్రమ్, పూజ, వేదా కృష్ణమూర్తి, తనియా బాటియా.