సుజుకి ‘హయబుసా’ 2019 ఎడిషన్‌

సుజుకి ‘హయబుసా’ 2019 ఎడిషన్‌

  సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపిఎల్‌) మార్కెట్లోకి ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌ హయబుసా 2019 ఎడిషన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ. 13.74 లక్షలుగా నిర్ణయించింది. 1,340 సిసి ఇంజిన్‌తో దేశ పరిస్థితులకు అనుగుణంగా సైడ్‌ రిఫ్లెక్టర్స్‌ను అమర్చామని ఎస్‌ఎంఐపిఎల్‌ ఎండి సంతోషి తెలిపారు. అప్‌డేటెడ్‌ గ్రాఫిక్స్‌తో మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే , గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ లాంటి రెండు రంగుల్లో లభిస్తుందన్నారు.