టాటా నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు

టాటా నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు

 ముంబై : దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్..తొలిసారిగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. గుజరాత్‌లోని సనంద ప్లాంట్లో తయారైన కాంప్యాక్ట్ సెడాన్ టిగోర్‌ను టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, గౌరవ చైర్మన్ రతన్ టాటాలు బుధవారం ఆవిష్కరించారు. ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్(ఈఈఎస్‌ఎల్) నుంచి 10 వేల ఎలక్ట్రిక్ కార్ల ఆర్డర్‌ను దక్కించుకున్న సంస్థ..మొదటి విడుతలో భాగంగా 350 కార్లను అందచేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లోభాగంగా బుధవారం 250 టిగోర్ కార్లను అందచేసిన సంస్థ..మిగతా 100 వాహనాలను త్వరలో అందచేయనున్నది. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనన్న అంచనాతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిపై కంపెనీ వినియోగదారులు గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా తెలిపారు.