తొలి ‘హ్యారియర్‌’ విడుదల

తొలి ‘హ్యారియర్‌’ విడుదల

  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ తొలి కారు మంగళవారం విడుదలైంది. పుణే యూనిట్‌లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి అయ్యిందని, వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే దేశవ్యాప్తంగా విడుదల కానుందని కంపెనీ ప్రకటించింది.ఈ సందర్భంగా సంస్థ ప్యాసింజర్‌ వాహన వ్యాపార యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ మాట్లాడుతూ.. ‘జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సహకారంతో కేవలం ఆరు నెలల్లోనే ఈ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాదిలో డెలివరీలకు సిద్ధమవుతున్నాం. 2019 తొలినాళ్లలోనే దేశవ్యాప్తంగా డెలివరీలు ప్రారంభిస్తాం. అని వ్యాఖ్యానించారు.