టయోటా యారిస్ వచ్చేస్తోంది‌..!

టయోటా యారిస్ వచ్చేస్తోంది‌..!

 న్యూఢిల్లీ: జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా తమ బ్రాండ్‌ వినియోగదారులకు కార్ల సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయనుంది. యారిస్‌ పేరుతో సీ- సెగ్మెంట్‌ కారును ప్రవేశపెడుతోంది. వచ్చే నెల నుంచి బుకింగ్స్‌ చేసుకోవచ్చని, మే నుంచి అమ్మకాలు మొదలవుతాయని సంస్థ తెలిపింది. తమ కొత్త యారిస్‌... హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్‌, హ్యూందాయ్‌ వెర్నాలకు గట్టిపోటీనిస్తుందని సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్‌ వినియోగదారులకు ఇతియోస్‌ సెడాన్‌, కరోలా అట్లిస్‌ వంటి ఉత్తమ కార్లను అందజేశామని, ఇప్పుడు యారిస్‌ కూడా అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యారిస్‌ ఫీచర్లు...
1.5 లీటర్ల పెట్రోల్‌ సామర్థ్యం గల ఇంజన్‌
రెండు గేర్‌ బాక్సులు(6- స్పీడ్‌ మాన్‌వల్‌ లేదా 7- స్ఫీడ్‌ సీవీటీ ఆటోమేటిక్‌)
7 ఎయిర్‌ బ్యాగులు
ధర : 10 నుంచి 12 లక్షలు(ఢిల్లీ ఎక్స్‌ షోరూం)