యూఎంఐ నుంచి మరో రెండు బైకులు

యూఎంఐ నుంచి మరో రెండు బైకులు

 హైదరాబాద్: అమెరికాకు చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ యునైటెడ్ మోటార్స్ ఇంటర్నేషనల్ (యూఎంఐ) .. రెనిగేడ్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడానికి మరో రెండు బైకులను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రూ.1.92 లక్షల విలువైన క్లాసిక్ మోడల్ ఒకటికాగా, రూ.1.84 లక్షల ధర కలిగిన మోజేవ్ మోడల్ కూడా ఉన్నది. 279.5 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకులు గంటకు 130-135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. 


ఈ సందర్భంగా యూఎం ఇండియా డైరెక్టర్ జోస్ విలేజస్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా లగ్జరీ బైకులకు డిమాండ్ పెరుగుతుండటంతో వచ్చే మార్చి నాటికి 28 వేల యూనిట్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతేడాది సంస్థ 10 వేల యూనిట్ల అమ్మకాలు జరిపింది. వ్యాపార విస్తరణలో భాగంగా ముంబై-పుణె మధ్యలో రెండో అసెంబ్లింగ్ యూనిట్‌తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం సంస్థ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నది.