ఎక్సెంట్ ప్రైమ్‌లో సీఎన్‌జీ మోడల్

ఎక్సెంట్ ప్రైమ్‌లో సీఎన్‌జీ మోడల్

 న్యూఢిల్లీ: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ మోటార్.. ఎక్సెంట్ ప్రైమ్‌లో సీఎన్‌జీ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధరను (ఢిల్లీ రూ.5.93 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు గరిష్ఠ రేటు రూ.6.12 లక్షలు. అదనంగా సీఎన్‌జీ ఫిట్టింగ్‌తో రూపొందించిన ఈ కారు కమర్షియల్ సెగ్మెంట్‌లో అతి తక్కువ ధరకే లభించనున్నదని హ్యుందాయ్ మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. యూనిట్‌లో ఫిట్ అయిన సీఎన్‌జీతో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలాగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో పన్ను రాయితీ కూడా లభించనుందని అన్నారు.