>

యమహా కొత్త బైక్‌ ఫ‌స్ట్‌లుక్‌ ఆవిష్కరించిన జాన్ అబ్రహాం

యమహా కొత్త బైక్‌ ఫ‌స్ట్‌లుక్‌ ఆవిష్కరించిన జాన్ అబ్రహాం

 న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో కొత్తకొత్త బైకులు విడుదలవుతున్నాయి. ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ యమహా తయారు చేసిన మరో కొత్త స్పోర్ట్స్ బైక్ వైజెడ్‌ఎఫ్-ఆర్3ని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం మార్కెట్లోకి ఆవిష్కరించారు. దీని ధర రూ.3.48(ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. దాదాపు ఏడాది తర్వాత యమహా కొత్త హంగులతో భారత వినియోగదారుల కోసం ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. యమహా బ్రాండ్ అంబాసిడర్ అబ్రహాంతోనే ఈ బైక్‌ను విడుదల చేయడం విశేషం. ప్రపంచవేదికపై గత నవంబర్‌లోనే విడుదల చేసినప్పటికీ భారత్‌లో యమహా ఆర్3 2018 ఎడిషన్‌ను ప్రస్తుతం అందుబాటులోకి తెస్తోంది. కొత్త మోడల్‌లో నూతన సాంకేతికతను అమర్చడంతో పాటు పలు రంగుల్లో వీటిని స్పోర్ట్స్ బైక్ ప్రేమికుల కోసం తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.