యమహా కొత్త బైక్‌ లాంచ్‌..

యమహా కొత్త బైక్‌ లాంచ్‌..

 న్యూఢిల్లీ: యమహా మోటార్ (ఐఐఎం) కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. ఎఫ్‌జెడ్‌ సీరిస్‌కు కొనసాగింపుగా  మెరుగైన  బ్రేకింగ్‌ సిస్టంతో యమహా ఎఫ్‌జెడ్‌ 25 పేరుతో  శుక్రవారం విడుదల చేసింది.  ఫేజర్‌ 250 ఇంజీన్‌తో దీన్ని రూపొందించింది. అలాగే పాత మోడ్‌లో 5  స్పోక్‌ అల్లాయ్‌వీల్స్‌తో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన  బైక్‌లో స్పోర్టీ 10- స్పోక్‌ అల్లాయ్ వీల్స్‌ను జోడించింది.  ఈ కొత్త వెర్షన్‌  బైక్‌ను రూ. 86,042 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకు విడుదల చేసింది. 

 తమ లేటెస్ట్‌ బైక్‌  మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థతో మంచి పనితీరు సామర్థ్యాన్ని  ఇస్తుందని  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 149 సి.సి. 4-స్ట్రోక్ ఇంజిన్‌,  220 ఎంఎం హైడ్రాలిక్ సింగిల్ రియర్‌ డిస్క్ బ్రేక్,   282 మిమీ ఫ్రంట్ బ్రేక్‌   ఫీచర్ల కారణంగా వాహనం స్టెబిలిటీ, కంట్రోల్‌ మెరుగుపడుతుందని పేర్కొంది.

దాదాపు పది సంవత్సరాల క్రితం భారత్‌లో లక్షలాదిమందికి పైగా వినియోగదారులను ఆకర్షించామని, ఈ కొత్త వెర్షన్‌ ద్వారా మరింతమంది కస్టమర్లు ఈ కోవలో చేరనున్నారనే విశ్వాసాన్ని  యమహా మోటార్ ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. తమ కొత్త బైక్‌ లుక్‌,  అధునాతనమైన ఇంజీన్‌ టెక్నాలజీ, ఫ్యూయల్‌ మేనేజ్‌   పాత, కొత్త వినియోగదారులకు  ఉత్తేజపరుస్తుందన్నారు.