బ్యాంకు లాభంలో 20% వృద్ధి@హెచ్‌డీఎఫ్‌సీ.

బ్యాంకు లాభంలో 20% వృద్ధి@హెచ్‌డీఎఫ్‌సీ.

బ్యాంకు లాభంలో 20% వృద్ధి@హెచ్‌డీఎఫ్‌సీ.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకు లాభం రూ.3239 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన లాభంతో పోలిస్తే ఇది 20.2 శాతం అధికం. ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నప్పటికీ ప్రధాన నికర వడ్డీ ఆదాయం మెరుగ్గా పెరగడంతో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించగలిగింది. బ్యాంకింగ్‌ పరిశ్రమలోనే అత్యుత్తమ ఆస్తుల నాణ్యత గల బ్యాంకుగా పేరున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సైతం ఇతర బ్యాంకుల తరహాలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే రిటైల్‌ రుణాల విషయంలో ఇప్పటికీ పరిశ్రమ సగటు కంటే అధికంగానే ఈ బ్యాంకు ఇస్తుండడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్థూల నిరర్థక రుణాలు 0.95 శాతం నుంచి 1.04 శాతానికి పెరగ్గా.. నికర నిరర్థక ఆస్తులు పెద్దగా మార్పు లేకుండా 0.3 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ఇందు కోసం బ్యాంకు కేటాయింపులను రూ.728 కోట్ల నుంచి రూ.866.7 కోట్లకు పెంచాల్సి వచ్చింది. మొండి బకాయిలు పెరిగినా బ్యాంకుకు ప్రస్తుతానికి ఇబ్బందులేమీ లేవని డిప్యూటీ ఎండీ పరేశ్‌ సుక్తాంకర్‌ పేర్కొన్నారు. 'ఇప్పటికీ మొండి బకాయిల విషయంలో చాలా సౌకర్యంగానే ఉన్నాం. తీవ్ర ఇబ్బందులూ లేవు. కార్పొరేట్‌ ఖాతాల వల్ల మొండి బకాయిలు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం మా నికర ఆదాయంలో 71 శాతంగా ఉంది. అది 21.8 శాతం వృద్ధి చెంది ఆదాయాన్ని పెంచింద'ని వివరించారు.