బీవోబీ వడ్డీరేట్లలో స్వల్ప పెంపు

బీవోబీ వడ్డీరేట్లలో స్వల్ప పెంపు

  న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగా జరిగిన తొలి పరపతి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కీలక వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు(0.1 శాతం) పెంచడంతో 8.40 శాతానికి చేరుకుంది. దీంతో రుణ గ్రహితలపై స్వల్ప భారం పడనున్నది. పెంచిన వడ్డీరేట్లు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి.