నేటి నుంచి ఎస్‌బీఐ ప్రాపర్టీ, ఆటో ఎక్స్‌పో

నేటి నుంచి ఎస్‌బీఐ ప్రాపర్టీ, ఆటో ఎక్స్‌పో

  హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదాపూర్ రీజియన్ ఆధ్వర్యంలో నేడు, రేపు ప్రాపర్టీ, ఆటో రుణమేళా నిర్వహించనున్నట్టు సికింద్రాబాద్ డిప్యూటి జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. ఆది, సోమవారాల్లో కొండాపూర్‌లోని సైబర్ కన్వేషన్ సెంటర్‌లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రుణమేళా కొనసాగుతుందని చెప్పారు. ఇందులో ప్రముఖ రియల్‌ఎస్టేట్స్ సంస్థల యజమానులు, బిల్డర్స్ పాల్గొంటారని, వినియోగదారులు తమకు నచ్చిన ఇంటిని, ప్లాట్‌ను, వాహనాన్ని ఎంచుకొని అక్కడే రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, గుర్తింపు కార్డ్, చివరి 3 నెలల జీతం స్టేట్‌మెంట్, 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్ డాక్యుమెంట్స్‌తో హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 99490 88386 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.