దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌కు విదేశీ ప్రయాణంపై నిషేదాజ్ఞలు

దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌కు విదేశీ ప్రయాణంపై నిషేదాజ్ఞలు

 ముంబయి: ఐసిఐసిఐ- వీడియోకాన్‌ రుణాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు సిఇఒ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు ఫారిన్‌ ట్రావెల్‌ బ్యాన్‌ను విధించినట్లు ఇడి అధికారులు తెలిపారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ఆయన దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. ఆయనతో పాటు వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌పై కూడా ఫారిన్‌ ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు నమోదు చేసిన సిబిఐ దీపక్‌, వేణుగోపాల్‌లను అనుమానితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు ఒక ప్రభుత్వాధికారి మీడియాకు వెల్లడించారు. అయితే చందా కొచ్చర్‌పై ఎలాంటి ఆరోపణలు లేనందున ఆమెపై ఎటువంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని తెలిపారు. అయితే ఆమె విదేశాలకు వెళ్లేటపుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సిబిఐ కోరినట్లు తెలిపారు. కాగా, లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను వేణుగోపాల్‌ ఖండించారు.