డిజిటల్‌ చెల్లింపులపై కమిటీకి ఛైర్మ‌న్‌గా నీలేకని

 డిజిటల్‌ చెల్లింపులపై కమిటీకి ఛైర్మ‌న్‌గా నీలేకని

 ముంబయి: డిజిటల్‌ చెల్లింపులను విస్తృతం చేసే దిశగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిజిటల్‌ చెల్లింపుల్లో వినియోగదారులకు మరింత భద్రతను కల్పించే అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆధార్‌ రూపకర్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకనిని ఈ కమిటీని అధ్యక్షుడిగా నియమించింది.ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, లోపాలను గుర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. వాటిని సరిచేసేందుకు తగిన సలహాలు, సూచనలు కూడా ఇస్తుందని పేర్కొంది. అంతేగాక.. డిజిటల్‌ చెల్లింపులపై వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకునే చర్యలపై కూడా సలహాలిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.