ఇషా - ఆనంద్‌ వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌

ఇషా - ఆనంద్‌ వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌

  ముంబై: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీల రాయల్‌ వెడ్డింగ్‌ వేడుక అంశం మరోసారి వార్తల్లోకొచ్చింది.  త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్‌ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ  పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్‌  తనయుడు) మూడుముళ్ల సంబరానికి శుభముహూర‍్తం దగ్గరపడుతోంది.   అత్యంతఘనంగా నిశ్చాతార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వీరి వివాహ ఈ వేడుక కోసం  దేశీయ మీడియాతోపాటు  అంతర్జాతీయ మీడియాకూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో  వీరి పెళ్లి శుభలేఖకు సంబంధించిన వీడియో ఒకటి నెట్‌ లో చక్కర్లు కొడుతోంది. 

కార్పొరేట్‌ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్‌ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకోనుంది.కాగా డిసెంబర్10న పెళ్లి పీటలెక్కనున్న ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహ వేడుకుకు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు నెటిజనులను  ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే  ప్రదర్శన ఇవ్వనున్నారనీ, ఇందుకు ఆమెకు భారీగానే ( రూ.15 కోట్లు)  పారితోషికం ఆఫర్‌ చేశారట.  ఈ లవ్‌బర్డ్స్‌  నిశ్చితార్థ కార్యక్రమాన్ని  గత నెలలో  ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.