ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం సేవ‌లకు అంత‌రాయం..!

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం సేవ‌లకు అంత‌రాయం..!

 ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సేవ‌ల‌కు ప్రస్తుతం అంత‌రాయం క‌లుగుతోంది. అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల గ‌త కొద్ది నిమిషాల నుంచీ ఫేస్‌బుక్ ప‌నిచేయ‌డం లేదు. 500 ఇంట‌ర్న‌ల్ స‌ర్వ‌ర్ ఎర్ర‌ర్‌ అనే మెసేజ్ చూపిస్తోంది. కొన్ని చోట్ల ఫేస్‌బుక్ సైట్‌ను ఓపెన్ చేయ‌గానే ఫేస్‌బుక్ విల్ బి బ్యాక్ సూన్ మెసేజ్ ద‌ర్శ‌న‌మిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్‌ యాప్‌, వెబ్‌సైట్‌లు ఏవీ ప్ర‌స్తుతం ప‌నిచేయ‌డం లేదు. 

దీంతోపాటు ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రాం యాప్‌, వెబ్‌సైట్ లు కూడా ప‌లు చోట్ల ప‌నిచేయ‌డం లేద‌ని తెలిసింది.అమెరికా, యూకే, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ రెండు వెబ్‌సైట్ల సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున యూజ‌ర్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అనేక మంది ఈ విష‌యం ప‌ట్ల స్పందిస్తున్నారు. ఫేస్‌బుక్ డౌన్ అవ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ట్విట్ట‌ర్‌లో జోకులు పేలుస్తున్నారు. అయితే ఈ రెండు సైట్లు, యాప్‌ల సేవ‌ల అంత‌రాయానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.