జనవరి 26 నుంచి ఎయిర్ బోట్ సేవలు

జనవరి 26 నుంచి ఎయిర్ బోట్ సేవలు

 న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ కు ఎయిర్ బోట్ సర్వీసు సేవలు అందించనుంది. కుంభమేళా నేపథ్యంలో ఎయిర్ బోట్ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రోడ్డు రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రష్యన్ ప్రభుత్వం రూపొందించిన పరిజ్ఞానంతో ఎయిర్ బోట్ సేవలు కొనసాగనున్నట్లు చెప్పారు. ఎయిర్ బోట్ సేవలను జనవరి 26 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎయిర్ బోట్ లో ఒకేసారి 16 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ బోట్ సర్వీస్ వెళ్లనుంది. ప్రయాగ్ రాజ్ ,హల్దియాను అనుసంధానం చేస్తూ వారణాసి వరకు ఎయిర్ బోటు సేవలు కొనసాగనున్నాయి. ఈ నెల 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.