నీరవ్‌మోడీ మరో మోసం

నీరవ్‌మోడీ మరో మోసం

  న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి మరొక కెనడియన్‌కు కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. అతడికి నకిలీ వజ్రాల ఉంగరాలను రెండు లక్షల డాలర్లకు( సుమారు కోటి యాభై లక్షల రూపాయలు) అమ్మాడని దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ నివేదిక పేర్కొంది. దీంతో అతని నిశ్చితార్థం రద్దు అయ్యి, సహచరి కూడా విడిచిపెట్టిందని, అతడు నిరాశలో కూరుకున్నాడని తెలిపింది.. ఓ కంపెనీలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న పాల్‌ ఆల్ఫాన్సో అనే వ్యక్తి హంగ్‌కాంగ్‌లోని డయామెంటరీ నుండి అతని సహచరి కోసం రెండు ఉంగరాలను కొనుగోలు చేశారు. 

అనంతరం అవి నకిలీ వజ్రాలుగా గుర్తించారు. ఆల్ఫాన్సో పేర్కొన్న వివరాలు నివేదికలో ఇలా ఉన్నాయి ఓ వేడుకల సందర్భంగా 2012లో నీరవ్‌మోడీని ఆల్ఫాన్సో లాస్‌ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో కలిశాడు. అనంతరం మరొక సందర్భంగా కలిసి మాట్లాడుకున్నారు. కొన్ని సంవత్సరాలు వారిద్దరూ కలవలేదు. కాగా, అప్పటికే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అవకతవలకు నీరవ్‌ పాల్పడ్డాడని తెలియని ఆల్ఫాన్సో ఈ ఏడాది ఏప్రిల్‌లో తన సహచరి కోసం నిశ్చితార్థపు ఉంగరాన్ని లక్ష డాలర్లలో తయారు చేయాలని మోడీకి మెయిల్‌ చేశాడు. దీంతో రూ.1,20, 000 డాలర్లలతో ఒక ఉంగరాన్ని ప్రతిపాదించగా ఆల్ఫాన్సోకు నచ్చడంతో నీరవ్‌ అతడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, అల్ఫోన్సో సహచరి మరో రింగుకు అడగ్గా 80 వేల డాలర్లతో తయారు చేసిన ఉంగరాన్ని నీరవ్‌ అసిస్టెంట్‌ నుండి పొందారు. అల్ఫాన్సో, అతడి కాబోయే ఇద్దరూ రింగులను బీమా చేయించాలని అనుకున్నారు.

కాని ధృవపత్రాలు ఇంకా రాలేకపోయే సరికి వీటి గురించి నీరవ్‌కు మెయిల్స్‌ను పంపాడు. ధృవపత్రాలు వస్తున్నాయని నీరవ్‌ చెప్పుకుంటూ వచ్చారు. కాగా,ఆగస్టులో వీటిని ఓ వజ్రాల నిర్ధారకుని వద్దకు ఆల్ఫాన్సో సహచరి తీసుకెళ్లడంతో అవి నకిలీవని వెల్లడయ్యాయి. ఆల్ఫాన్సో మోసాన్ని నిర్ధారించుకోలేదు. అయితే అతడి మోసపూరితమైన లావాదేవీల గురించి వార్తలు చూసే సరికి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం కాబోయే భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె అభిప్రాయం ప్రకారం తెలివైన వ్యక్తినైన తాను ఇలా మోసపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేసిందని దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌కు వెల్లడించారు. అనంతరం తాను నిరాశకు గురై కోపంతో నీరవ్‌కు ఆగస్టు 13న మెయిల్‌ పంపానని తెలిపారు. అతడు నీరవ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సుమారు 4.2 మిలియన్‌ డాలర్లను ఇప్పించాలని దావా వేశారు. ఈ విచారణ వచ్చే ఏడాది జనవరిలో జరుగుతుంది.