ఓలాలో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడులు

ఓలాలో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడులు

  ముంబై:  క్యాబ్‌ అగ్రిగేటర​ ఓలాకు భారీ పెట్టుబడుల ఆఫర్‌ లభించింది. జపాన్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు  సాఫ్ట్‌బ్యాంకు మరోసారి ఓలాలో భారీ పెట్టుబడులకు దిగుతోంది.  ఓలాలో  ఒక బిలియన్ డాలర్ల (రూ.704కోట్లు) నిధులను సరఫరా చేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.అయితే  ఇప్పటికే  ఓలాలో 26శాతం వాటా వున్న సాఫ్ట్‌బ్యాంకు మరిన్ని పెట్టుటబడులను ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్   ఆమోదించారా లేదా అనేది స్పష్టతలేదు. మరోవైపు బెంగళూరుకు చెందిన కంపెనీ టాక్సీ సేవల సంస్థ ఓలా తన ఆహార పంపిణీ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సిద్ధంగా ఉంది.  అంతేకాదు, ఇ-ఫార్మసీ వంటి విభాగాలలో పెట్టుబడులకు యోచిస్తోది.