పెరిగిన క్యాన్సర్‌ పాలసీల అమ్మకాలు

పెరిగిన క్యాన్సర్‌ పాలసీల అమ్మకాలు

  హైదరాబాద్‌: క్యాన్సర్‌ పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, తాము ఇప్పటివరకు 1.25 లక్షల పాలసీలను విక్రయించినట్లు ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ జోనల్‌ మేనేజర్‌ వీ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. జీవన్‌ ఆరోగ్య, క్యాన్సర్‌ పాలసీలకు డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. ఒక తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో 25 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలిందని ఇక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుండగా... ఎల్‌ఐసీ రూ.50 లక్షల వరకు పాలసీని అందిస్తున్నట్లు తెలిపారు.