రేడియేషన్ లేని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు

రేడియేషన్ లేని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు

  సుల్తాన్‌బజార్: నగరంలోని ప్రభుత్వ దవాఖానలలో సెల్‌ఫోన్ సిగ్నళ్లు అందక వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు పడుతున్న ఇబ్బం దులకు చెక్ పెట్టేందుకు గాను బీఎస్ ఎన్‌ఎల్ అధికారులు చర్యలు చేపడు తున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియా దవాఖానలో అధికారులు పర్యటించారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలతో త్వరలో ఉస్మానియా, కోఠి ఈఎన్టీ, పేట్లబుర్జు దవాఖానల్లో సెల్‌ఫోన్ సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడనుంది.ఉస్మానియా, కోఠి ఈఎన్టీ దవా ఖానలలోకి వచ్చిన అనంతరం సిగ్నళ్లు కలువక సెల్‌ఫోన్‌లు పని చేయని పరిస్థితి ఉంది. దీంతో రోగుల గురించిన సమాచారం అందక వారి బంధు వులు ఇబ్బందుల పాలవుతున్నారు. నగరంలో ఉన్న వారు నేరుగా దవా ఖానకు వచ్చి రోగుల యోగక్షేమాలు తెలుసుకుంటుండగా దూర ప్రాంతాల వారికి యోగక్షేమాలు తెలువక తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

దీనిని అధి గమించేందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో ఆయా దవాఖానలలో రేడియేషన్ ప్రభావం లేని సిగ్నళ్ల వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కులీకుతుబ్‌షా బ్లాక్, పాత భవనాలలో సెల్‌ఫోన్ సిగ్న ళ్లు అందకపోవడంతో వైద్యులతో పాటు రోగులు కూడా పడరాని పాట్లు పడుతున్నారు. రేడియేషన్‌కు అవకాశం లేని స్టాటర్లను ఏర్పాటు చేయడం ద్వారా దవాఖానలలో బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బీఎస్ ఎన్‌ఎల్ ఏజీఎం దినేష్ తెలిపారు.